22 May, 2026 | 4:00 AM

స్వర్గీయ రాజీవ్ గాంధీకి నివాళులు

22-05-2026 12:09 AM

ఘట్ కేసర్, మే 21 (విజయక్రాంతి): దేశ మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలు గురువారం ఘట్కేసర్ సర్కిల్ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. 6వ డివిజన్ ఘట్కేసర్ పట్టణం, 7వ డివిజన్  ఎదులాబాద్, ఘనపురం 8వ డివిజన్ పోచారం రాజీవ్ గృహకల్పలలో జరిగిన వేడుకలకు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి, చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం ఘట్కేసర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో  రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా రాజీవ్ గాంధీ దేశ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు.  కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మామిండ్ల ముత్యాలు యాదవ్, మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, మాజీ సర్పంచ్ లు ననావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, బద్దం గోపాల్ రెడ్డి, వెంకటేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ కుతాడి రవీందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాయరు విశ్వనాధ్, బొక్క ప్రభాకర్ రెడ్డి, కవాడి మాధవ రెడ్డి, కీసరగుట్ట ఆలయ డైరెక్టర్లు సగ్గు అనీత, సామల అమర్, మాజీ ఉప సర్పంచ్ లు వేముల సత్తయ్య గౌడ్, అకిటి సుధాకర్ రెడ్డి, వేముల పరమేష్ గౌడ్, మహిళ కాంగ్రెస్ నాయకురాలు పైళ్ల లత రెడ్డి, నాయకులు బొక్క సత్తిరెడ్డి, వేముల కేశవనాథంగౌడ్, ఉల్లి ఆంజనేయులుయాదవ్, మెట్టు రమేష్, డొంకెని శంకర్ గౌడ్, మెట్టు నర్సింహా, బింగి రాజేందర్ గౌడ్, బొక్క సుధాకర్ రెడ్డి, సగ్గు శ్రీనివాస్, ననావత్ సురేష్ నాయక్, మేకల సునీల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.