11 May, 2026 | 2:06 PM

Breaking News

ప్రారంభమైన నివాసాలకు గుర్తింపు   •   వెంచర్లో అక్రమాలపై కుల సంఘాల పిర్యాదు   •   యూనియన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం!   •   మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •  

బట్టుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి ఆనవాళ్లు

27-12-2025 05:10 PM

పశువుల కాపర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 అటవీశాఖ అధికారులు

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని బట్టుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు కనిపెట్టినట్టు అటవీ శాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం చెన్నూరు అటవీ ప్రాంతం నుంచి గోదావరి దాటి మంథని మండలంలోని ఎల్ మడుగు  దాటి ఆరెంద అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నదని గుర్తించిన అటవీ శాఖ అధికారులు శనివారం  పెద్దపులి  అరెందా దాటి బట్టుపల్లి ఏరియాలో పులి ప్రవేశించిందని, పులి అడుగులు గుర్తించామని  అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు,  రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళలో బయట తిరగవద్దని, పశువులను అటవీ ప్రాంతంలోకి పంపించవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు.