11 May, 2026 | 1:00 PM

Breaking News

బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •  

పేద కుటుంబానికి అండగా నిలిచిన డా. సంపత్ కుమార్

27-12-2025 05:05 PM

తాండూరు,(విజయక్రాంతి): కుటుంబ పెద్దను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న నిరుపేద కుటుంబానికి ఆపద సమయంలో ఆర్థికంగా ఆదుకొని అండగా నిలిచారు. వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రముఖ వైద్యులు, బివిజి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, తాండూర్ మున్సిపల్ పరిధి 8వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన గురువయ్య స్వామి భార్య గద్వాల సుశీలమ్మ అకాల మృతి చెందారు.

స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డాక్టర్ సంపత్ కుమార్ వెంటనే స్పందించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి అంత్యక్రియలకు  వీరశైవ సమాజం సభ్యులు గులి పరమేశ్వర్,అబ్లం సంపత్ కుమార్, శ్రీకాంత్  ద్వార డాక్టర్ సంపత్ కుమార్ ఆర్థిక సాయం అందించారు. ఆపద సమయంలో డాక్టర్ సంపత్ కుమార్ అందించిన ఆర్థిక సహాయాన్ని అందుకున్న కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.