వన్యప్రాణుల సంరక్షణకు పటిష్ట చర్యలు
* అటవీశాఖ పిసిసిఎఫ్ డాక్టర్ సువర్ణ
* గుండం మార్గంలో పెద్దపులి వీక్షణ
అచ్చంపేట: అమ్రాబాద్ పులుల అభయారణ్యం పరిధిలోని వన్యప్రాణుల సంరక్షణకు పట్టిష్ట చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర అటవీశాఖ పిసిసిఎఫ్ డాక్టర్ సువర్ణ తెలిపారు. మూడు రోజుల కేటీఆర్ పర్యటనలో భాగంగా ఆమె టైగర్ రిజర్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో పర్యటించారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం – 2026 సందర్భంగా ఈనెల 20 నుంచి 22 వరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ను సందర్శించి, అటవీ సంరక్షణ కార్యకలాపాలను సమీక్షించి, ఫీల్డ్ సిబ్బందితో వివిధ అంశాలపై చర్చించారు.
సందర్శనలో భాగంగా, మద్దిమడుగు సెక్షన్‌లోని చింతమట్టం ఈకో టూరిజం పార్క్ ను పరిశీలించారు. ఈ ప్రాంతం పాత చింత చెట్లతో నిండి ఉండటం ప్రత్యేకతగా ఉండగా, ఆ ప్రాంతం పర్యావరణ ప్రాధాన్యతను అభినందించి, అందాల అభివృద్ధి (బ్యూటిఫికేషన్), కొత్త అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంను దర్శించుకున్నారు. సోమచెల్క సెక్షన్‌లోని ఈసుక రేగడి సాఫ్ట్ రిలీజ్ సెంటర్ ను పరిశీలించారు. ఈ కేంద్రంలో హైదరాబాద్ జూ, మహావీర్ హరిన వనస్థలి నేషనల్ పార్క్ నుంచి తీసుకువచ్చిన సుమారు 60 మచ్చల జింకలను (Spotted Deer) దశలవారీగా అడవిలోకి విడిచిపెట్టిన విషయాన్ని సమీక్షించారు.
ప్రస్తుత నిర్వహణపై విశ్లేషణ చేసి, హాబిటాట్ అభివృద్ధి, విడుదల అనంతర మానిటరింగ్ మెరుగుదలకు అవసరమైన సలహాలు అందించారు. మద్దిమడుగు అటవీ ప్రాంతంలోని లోతైన ప్రాంతంలో ఉన్న పోర్క్యుపైన్ ట్రైల్‌లో నైట్ ప్యాట్రోలింగ్ నిర్వహించి, అటవీ రక్షణ చర్యల ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం ఈసుక రేగడి బేస్ క్యాంప్ వాచ్ టవర్ వద్ద రాత్రి బస చేసి, ముఖ్యంగా మహిళా అటవీ సిబ్బందితో పరస్పర సమావేశం నిర్వహించి, వారి సమస్యలను తెలుసుకుని ప్రోత్సహించారు.
అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా, కృష్ణా నది గద్దలసరీ తీర ప్రాంతాన్ని పరిశీలించి, రివర్ ప్యాట్రోలింగ్‌లో పాల్గొన్నారు, నది పరిసర వ్యవస్థల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేశారు. మన్ననూర్ రేంజ్‌లోని గుండెం బేస్ క్యాంప్ ను సందర్శించి, ఫర్హాబాద్ వ్యూ పాయింట్ కు వెళ్లారు. గుండెం రూట్ లో ప్రత్యక్షంగా పులిని వీక్షించారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా, వట్వర్లపల్లి గ్రామంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని, స్థానిక ప్రజలతో పరస్పర సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అడవుల ప్రాముఖ్యతను వివరించారు. టవీ సంరక్షణ, ఈకో టూరిజం అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దోమల పెంట లోని వన మయూరి గెస్ట్ హౌస్‌లో అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి, వన్యప్రాణులకు నీటి లభ్యత మరియు ఆధునిక పరికరాల ద్వారా అగ్ని ప్రమాద నివారణ చర్యలపై సమీక్షించారు.పర్యటనలో ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ .సునీల్ ఎస్ హిరామత్, ఏటీఆర్, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రేవంత్ చంద్ర నాగర్‌కర్నూల్, ఎఫ్డిఓ రామమూర్తి, రామమోహన్ గారు ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు.




