22 March, 2026 | 12:21 AM

ప్రతి ఒక్కరిలో ఆనందం, శాంతి నెలకొల్పాలి

21-03-2026 10:34 PM

ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): పవిత్ర రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్ పట్టణంలోని స్థానిక ఈద్గా వద్ద ముస్లిం మైనార్టీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యానికి, సోదరభావానికి ప్రతీక అయిన ఈ పవిత్ర పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందం, శాంతి నింపాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, బి ఆర్ ఎస్ నాయకులు నాగం శశిధర్ రెడ్డి, కౌన్సిలర్లు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.