9 May, 2026 | 8:51 PM

త్రీ పేజ్ కరెంటు పెంచాలి

09-05-2026 07:23 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో త్రీ ఫేస్ కరెంటు పెంచాలని మండల సర్పంచులు శనివారం ట్రాన్స్కో ఏఈకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామాలకు కేవలం 12 గంటలు మాత్రమే త్రీ ఫేస్ కరెంటు ఇవ్వడంతో గ్రామాలలో నీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. గతంలో మాదిరిగా అర్ధరాత్రి 12 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు త్రీ పేజ్ కరెంటు ఇవ్వాలని ఏఈని కోరారు.కరెంటు లేకపోవడంతో గ్రామాల్లోని ట్యాంకులు నిండడం లేదని దీంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.