9 May, 2026 | 8:52 PM

ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా శ్రీహరి రాజు

09-05-2026 07:21 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా శ్రీహరి రాజు పదవి బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఇక్కడ పని చేసిన ఉమా మహేశ్వర్ రావ్ ఎన్నికల సమయంలో బదిలీపై వచ్చారు. సుమారు నాలుగు నెలలు పని చేసి బదిలీపై వెళ్లారు. బాన్సువాడ నుంచి శ్రీహరి రాజు బదిలీపై వచ్చారు. పట్టణంలోని 36 వార్డుల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా మురికి కాలువల నీళ్లు రోడ్లపై పారుతున్నాయి. వార్డుల్లో చెత్త ఎక్కడికక్కడ పెరుకుపోయాయి. వీటిపై కమిషనర్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.