calender_icon.png 14 February, 2026 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవం

14-02-2026 06:47:28 PM

నూతనకల్(విజయక్రాంతి): మండల పరిధిలోని వెంకేపల్లి గ్రామంలో శ్రీ  సీతారామాంజనేయ స్వామి దేవస్థాన తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ, గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు ఈ వేడుకలకు తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలోని సీతారామాంజనేయ స్వామి మరియు రామలింగేశ్వర స్వామి వార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.​

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇమ్మడి జయకుమార్, దేవాలయ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గౌడ్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోనకనూరి సైదులు గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు కుంట్ల చంద్రారెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్ తో పాటు గ్రామ ప్రజలు, భక్తులు మరియు ఇతర ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారి వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.