వర్షాలు కురవాలని పూజలు
15-07-2026 01:55 AM
నసురల్లాబాద్ జులై 14 ( విజయ క్రాంతి): వర్షాలు కురవాలన నసురల్లాబాద్ మండలం మైలారం గ్రామస్తులు భజన చేస్తూ మంగళవారం11 హనుమాన్ మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి బయలుదేరి వెళ్లారు. వారు మాట్లాడుతూ నెలరోజులైనా వర్షాలు కురవకపోవడంతో పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు 11 హనుమాన్ మందిరాలలో ప్రత్యేక జలాలతో పూజలు నిర్వహిస్తే వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వారు తెలిపారు






