14-02-2026 06:50:27 PM
భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ గ్రామంలోని సిద్ధిరామేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్యాధికారి డాక్టర్ విద్య ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు (14, 15, 16 తేదీలలో) హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. భిక్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దివ్య పర్యవేక్షణలో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందిని షిఫ్టులవారీగా నియమించారు. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే ప్రాథమిక చికిత్స అందించేలా అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. శనివారం హెల్త్ క్యాంపులో హెల్త్ అసిస్టెంట్ సతీష్, ఆశా కార్యకర్తలు స్వరూప, అనురాధ భక్తులకు సేవలందించారు.