సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
ఎల్లారెడ్డి,జులై,14,(విజయ క్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంలో స్థానిక విలేఖరి తెలీనివో ప్రభావంతో రైతులు వేసినటువంటి పంటలకు సాగునీరు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నందున మీ అభిప్రాయం అడగగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బారాస నేతలను కోసి వారి నెత్తురు పొలాల్లో చల్లాలని చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలపై ఎల్లారెడ్డి మండల బారాస నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బారాస పట్టణ అధ్యక్షుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడడం తెలంగాణ రాష్ట్రానికే సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం స్థాయిలో ఉన్న వారు బాధ్యతాయుతంగా మాట్లాడవలసింది పోయి రక్తం పొలాల్లో చల్లాలని ముఖ్యమంత్రి చెప్పడం రైతులను అవమానించడమేనని ఆయన అన్నారు ఆయన మాటలపై ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్న కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఏగుల నర్సింలు గంగారెడ్డి శ్రవణ్ నారాయణ ఇమ్రాన్ బర్కత్ అమీర్ దయాకర్ బబ్లు దేవదాస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.






