14-02-2026 06:43:51 PM
మొదటిసారి కౌన్సిలర్ కు చైర్మన్ పదవి
నిర్మల్,(విజయక్రాంతి): అదృష్టం అంటేనే అప్పల కావ్యది. ఆమె కుటుంబ నేపథ్య రాజకీయం అయినప్పటికీ రాజకీయాలపై ఇప్పటివరకు అంతగా ఆసక్తి చూపలేదు. ఈసారి నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళలకు కేటాయించడంతో మాజీ మున్సిపల్ చైర్మన్ భార్య అయిన అప్పల కావ్యను చైర్మన్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. పట్టణంలోని 36 వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు.
మొదటిసారిగా కౌన్సిలర్ గా ఎన్నికైన పప్పాల కావ్యకు ఏకంగా మున్సిపల్ చైర్మన్ పదవి దక్కింది. ఆమె భర్త అయినా అప్పాల గణేష్ చక్రవర్తి నిర్మల్ మున్సిపల్ చైర్మన్గా 2014 నుంచి 2019 వరకు పని చేశారు. మొదటిసారిగా ఎన్నికై అప్పల కావ్య నిర్మల్ ప్రథమ పౌరురాలిగా ప్రజలకు సేవ చేసే అదృష్ట భాగ్యం కలిగింది. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ అప్పాల కావ్యను చైర్మన్గా ప్రకటించడంతో పట్టణంలోని అన్ని వార్డుల ప్రచారంలో పాల్గొని ప్రజలతో మమేకమైంది .