23 April, 2026 | 1:58 AM

ప్రజల సంక్షేమమే మా లక్ష్యం

23-04-2026 12:32 AM

దేవరకద్ర ఎమ్మెల్యే జియంఆర్ 

మూసాపేట్, ఏఫ్రిల్ 22: మండలం నిజాలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మూసాపేట్ మండలం కు చెందిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసి, తదనంతరం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు, అదేవిధంగా హైమాస్ట్ లైట్లను, చలివేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన 8లక్షల కోట్ల అప్పులకు, మిత్తిలు కట్టుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ, 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, సన్న బియ్యం ఇస్తున్నామన్నారు.

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తూ, పైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు, పదేండ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని పేర్కొన్నారు.పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే బిఆర్‌ఎస్ ఓర్వలేక పోతుందన్నారు, అప్పుడు కానీ, ఇప్పుడు కానీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.