23 April, 2026 | 1:57 AM

ఆర్టీసీ సమ్మెతో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

23-04-2026 12:33 AM

కలెక్టర్ ప్రతిమసింగ్ 

మెదక్, ఏప్రిల్ 22(విజయ క్రాంతి) :  ఆర్టీసీ సమ్మెతో మెదక్ జిల్లాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం మెదక్ కలెక్టరేట్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  .. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేస్తాం అన్నారు. ప్రైవేట్ వాహనదారులు ఎక్కువ ఛార్జ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎమర్జెన్సీ అవసరాల కోసం కంట్రోల్ నంబర్ 9391942254 ఏర్పాటు చేశామని, ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మె వల్ల జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సమ్మెతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామ న్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ బస్ డిపోల నుంచి బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మెదక్ నుంచి 100, నర్సాపూర్ నుంచి 34 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. రెండు బస్ డిపోల పరిధిలో కొత్తగా కండక్టర్ లను నియమిస్తున్నామని, అదే విధంగా గతంలో ఆర్టీసీ డ్రైవర్ ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిని పరిశీలించి తీసుకుని వారి సేవలు వినియోగించుకుంటున్నామని అన్నారు.

పోలీస్ , రెవెన్యూ, రవాణా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్, కంపెనీ ల వారిని సహకరించాలని కోరడం జరిగిందని వారి సహకారంతో ప్రజల అవసరాల మేరకు వారికి బస్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎమర్జెన్సీ అవసరాల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అవసరం ఉన్నవారు 9391942254 నంబర్ లో సంప్రదించాలని కోరారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ఎవరైనా ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీ లు వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు పాల్గొన్నారు.