20 May, 2026 | 3:18 AM

పాతాళానికి రూ‘పాయె’!

20-05-2026 01:58 AM
  1. డాలర్‌తో పోలిస్తే అత్యంత కనిష్ఠానికి పతనం 
  2. రికార్డు స్థాయిలో 96.53కి చేరిక
  3. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై, మే ౧౯: అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి బలహీనపడి రికార్డు స్థాయిలో రూ.96.53కి చేరింది. ముడిచమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితులు స్టాక్‌మార్కెట్‌ను కుదిపేశాయి. ఐటీ షేర్లు కాస్త నిలకడగా ఉన్నప్పటికీ, ప్రైవేట్ బ్యాంకులు, ఇతర కంపెనీల షేర్లు పతనమయ్యాయి. చివరికి సెన్సెక్స్ 114.19 పాయింట్లు నష్టపోయి.. 75,200.85 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 31.95 పాయింట్లు క్షీణించి 23,618.00 వద్ద ముగిసింది. రంగాల వారీగా చూస్తే ఐటీ సూచీ ౩ శాతానికి పైగా పెరిగింది. ఇన్ఫోసిస్ దాదాపు ౫ శాతం లాభపడింది. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ మోస్తరు లాభాలను ఆర్జించాయి. ఇంధన ధరల పెరుగుదలతో ప్రభుత్వ రంగ చమురు సంస్థ హెచ్‌పీసీఎల్ లాభాలు ౩ శాతం పెరిగాయి. మరోవైపు, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్ ౨.౫ శాతం మేర నష్టపోయింది.