15 June, 2026 | 2:22 AM

ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం

15-06-2026 12:00 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు, జూన్ 14: పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ముత్తంగి పరిధిలోని బతుకమ్మ ఘాట్ వద్ద లావణ్య పద్మావతి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిబిరాల ద్వారా ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, వైద్యుల సలహాలు, అవసరమైన మందులు ఉచితంగా అందడం వల్ల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, భవిష్యత్తులో కూడా మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, మేరాజ్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, సందీప్, సురేష్, రవి, తదితరులు పాల్గొన్నారు.