బాలుని చికిత్సకు ఆర్థిక సహాయం
నల్గొండ టౌన్ జూన్ 14 పట్టణంలోని ఐటీ సమీపంలోని గాయత్రీ నగర్ కాలనీకి చెందిన పరమేశ్ కుమారుడు కౌశిక్ (14) . ఈ నెల 10న తీవ్రగాయాలతో ఇంటి ముందే రక్తపు మడుగులో కనిపించాడు. 9వ తరగతి చదువుతున్న బాలుని గంజాయి బ్యాచ్ దాడి చేసిందా, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందా అన్న విషయం స్పష్టంగా తెలియదా లేదు. స్థానిక వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
చికిత్సకు డబ్బులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడటంతో నకిరేకల్ కు చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలని ఆ కుటుంబం సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యర్థించింది. బాధిత కుటుంబం లిటిల్ సోల్జర్స్ కి ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మదేవర నరేష్, బట్టిపల్లి వెంకన్న, మాలె సతీష్ రెడ్డి పాల్గొన్నారు.






