15 June, 2026 | 3:38 AM

కాంగ్రెస్ పార్టీకి వెంకట్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయం

15-06-2026 12:00 AM

కాంగ్రెస్ నాయకులు 

గరిడేపల్లి, జూన్ 14 : కాంగ్రెస్ పార్టీకి గుర్రం వెంకటరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గానుగుబండ గ్రామంలో ఆదివారం జరిగిన ఆయన సంతాప సభలో వారు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి వెంకట్ రెడ్డి అంకిత భావంతో సేవలందించారని ఆయన సేవలు భావితరాలకు ఆదర్శమన్నారు. కార్యకర్తలను గ్రామంలో పటిష్టంగా అందర్నీ కలుపుకొని పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటూ చివరిదాకా పార్టీలో ఉంటూ ఉత్తమ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా మెలిగారన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు త్రిపురం అంజన్ రెడ్డి, పి.రంగనాథ్, జిల్లా కార్యదర్శి బచ్చలకూరి కృష్ణ ప్రసాద్, కందుల కోటిరెడ్డి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎస్.కె చాంద్ మియా, మాజీ ఎంపీటీసీలు పాకాల పరమేష్, బాల్తూరి సందీప్, కడప దేవదానం, యోహాను, దస్తగిరి, కృష్ణారెడ్డి, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.