calender_icon.png 14 February, 2026 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్‌లో వికసించిన కమలం

14-02-2026 12:00:00 AM

చతికినపడ్డ చెయ్యి... దూసుకెళ్లని కారు

మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకొని ప్రధాన పార్టీలు

కీలకం కానున్న స్వతంత్ర అభ్యర్థులు

ఆదిలాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కమలం వికసించింది. హోరాహోరీగా సాగిన పుర పోరులో అధికార కాంగ్రెస్ ను వెనకాల నెట్టేసింది. ఈ ఎన్నికల్లో చెయ్యి చితికిన పడగా,  కారు దూసుకెల్లకి లేకపోయిం ది. మరోవైపు గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులు లోపాలకవర్గం ఏర్పాటులో కీలకము కానున్నారు.

చైర్మన్ పీఠాన్ని అధిరోహించేందుకు ప్రధాన పార్టీలు మ్యాజిక్ ఫీగర్ చేరుకోకపోవడంతో స్వతంత్రులు కీలకం కానున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ లోని టీటీడీసీ కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు  ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల గాను 49 టేబుల్ లు ఏర్పాటు చేసి, రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేశారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్, ఎస్పీ అఖిల్ మహాజన్‌లు కౌంటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రౌండ్ నుండే ఆయా వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉంటూ దూసుకెళ్లారు. మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల్లో బీజేపీ 21 వార్డులో విజయ ఢంకా మోగించగా, అధికార కాంగ్రె స్ 11 స్థానాలకే పరిమితమైంది.

అటు బీఆర్‌ఎస్ పార్టీ 6 స్థానాల్లో, ఎంఐఎం 6 స్థానా లను కైవసం చేసుకోగా, స్వతంత్రులు 5 స్థానాల్లో గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు 26 స్థానా లు అవసరం ఉండగా, బీజేపీ ఇప్పటికే 21 స్థానాలు గెలుపొందగా, ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు ఎక్స్ అఫీషియో మెంబర్ లను కలుపుకొని 23 స్థానాలకు చేరుకుంది. కానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే 26 స్థానాలు కావాల్సి ఉంటుంది. దీంతో గెలుపొందిన ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. 

మున్సిపల్‌పై మరోమారు కాషాయపు జెండా..

ఆదిలాబాద్ మున్సిపాలిటీపై మరో మారు కాషాయం జండా ఎగరనుంది. 20 ఏళ్ల క్రితం బీజేపీ పార్టీ చైర్మన్ గా లాలా రాధేశ్యాం కొనసాగారు. ఆ తర్వాత ఇప్పుడే మళ్ళీ బీజేపీ చైర్మన్ పీఠాన్ని అధిరోహిం చనున్నారు.