calender_icon.png 15 February, 2026 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ పీఠంపై అప్పాల వంశం అధిపత్యం

14-02-2026 12:00:00 AM

నాలుగుసార్లు చైర్మన్ పదవి 

నిర్మల్ ఫిబ్రవరి 13 ( విజయక్రాంతి): ప్రస్తుతం ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల్లో ఒక్కసారి గెలవాలంటే తలకు మిం చిన భారం అవుతుంది. కానీ నిర్మల్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నాయకులు మూడు తరాల నేతలు నిర్మల్ మున్సి పల్ పీఠం అధిష్టించారు. ప్రజలకు విశిష్టమైన సేవలు అందిస్తూ పార్టీకి నమ్మిన బంటుగా మున్సిపల్ ఎన్నికల్లో సాధించారు. మొదట అప్పల నరసయ్య 1981 నుంచి 82 వరకు చైర్మన్ అయ్యారు.

ఆయన కోడలు ఆయన కోడలు అప్పల అనురాధ 2006 నుండి 2009 వరకు చైర్మన్ కాగా, ఆయన మనుమడు అప్పల అనుచక్రవర్తి 2014 నుండి 2019 వరకు మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో గణేష్ చక్రవర్తి భార్య అప్పల కావ్య నాలుగోసారి మున్సిపల్ చైర్మన్ పీఠా న్ని దక్కించుకున్నారు ఒకే కుటుంబం నుం చి నలుగురు మున్సిపల్ చైర్మన్ కావడం మూడు తరాల నేతలు కావడంతో అప్పల బ్రాండ్ నిర్మల్ మున్సిపల్‌లో రాజకీయ చర్చకు దారి తీస్తుంది.