calender_icon.png 14 February, 2026 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

14-02-2026 12:00:00 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి):  రాష్ట్రంలోనే ఆదిలా బాద్ మున్సి పాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా  తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కి భారీ మెజార్టీ ఇచ్చిన పట్టణ ఓటర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం బీజేపీ అభ్యర్థుల తో కలిసి క్యాంపులో ఉన్న ఎమ్మెల్యే మీడియాకు  వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చా రు. గెలుపొందిన అభ్యర్థులను శాలువా పూలమాలతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ మంజూరు చేయడం తో ఇక్కడి ప్రజలు బీజేపీ నీ గెలిపించి, ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఆయనకు కానుకగా ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ గోడం నగేష్ సహకారంతో ఆదిలాబాద్ పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని పేర్కొన్నారు.