16 August, 2026 | 11:15 PM

Districts - Adilabad

article_29527033.webp
ప్రతి పేద కుటుంబానికి డిజిటల్ రేషన్ కార్డు

బోథ్, ఆగస్టు 16 (విజయక్రాంతి): అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిజిటల్ కార్డులను అందజేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎల్, పోశెట్టి పేర్కొన్నారు. ఆదివారం సున్నాల మండల కేంద్రంలోని రేషన్ షాప్ లో అర్హులైన పేదలకు డిజిటల్ కార్డులను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా పేదలకు ఇవ్వలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బీమ్ రావు పాటిల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మునేశ్వర సోమన్న, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ నరోత్తం రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అమృత రావు ,పార్టీ సీనియర్ నాయకులు బాసెట్టి సుదర్శన్, చంద్రకాంత్ ,ఖలీల్ తో పాటు రేషన్ షాప్ డీలర్ పి గంగాధర్ ను ఉన్నారు.

16-08-2026

article_84782542.webp
ఆగస్టు 19న ఏజెన్సీ బందుకు పిలుపు

ఉట్నూర్, ఆగస్టు 16( విజయక్రాంతి): పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీలో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగ యువతకు 75% రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడంతో ఈనెల 19న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో బంద్ నిర్వహించుటకు తీర్మానించినట్లు తుడుం దెబ్బ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు పుర్కా బాపురావు అన్నారు. ఉమ్మడి జిల్లా తుడుం దెబ్బ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం ఇంద్రవెల్లి మండలంలోని గిరిజన అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా తుడుం దెబ్బ అధ్యక్షుడు పేందూరు దాదే రావు అధ్యక్షత వహించారు.

16-08-2026

article_26767642.webp
ఐక్యంగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం

బోథ్. ఆగస్ట్ 15 ( విజయక్రాంతి): ఆదివాసి గిరిజన గ్రామాల పటేండ్లు ఐక్యంగా ఉండి గ్రామాభివృద్ధికి సహకరించాలని న్యాయవాది పంద్రం శంకర్ కోరారు. ఆగస్టు 9న జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని విజయ వంతం చేసేందుకు సహకరించిన గ్రామాల పటేళ్లను ఆయా గ్రామాల రాయి సెంటర్ ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ఐక్యంగా ఉండి కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో ఇదే విధమైన సహకారం ఉండాలని కోరారు. కార్యక్రమంలో పాట్నాపూర్ సార్మెడి భీమ్రావు రిటైర్డ్ ఉద్యోగులు మందడి నాగరావ్ పెందూరు సోనేరావు వెంకట్రావు సర్పంచ్లు విశ్వేశ్వరరావు పెందుర్తి పృథ్వి మెస్రం కృష్ణ మాజీ సర్పంచ్ గోపాల్ మండాడి రాము కడప రమేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

15-08-2026