calender_icon.png 20 February, 2026 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిటికల్ మినరల్స్‌పైనే ప్రపంచ భవిష్యత్!

20-02-2026 12:18:57 AM

  1. వీటి ఆధీనానికి కొన్ని దేశాలు ప్రయత్నం
  2. ఇది జియోపొలిటికల్ అంశంగా మారింది
  3. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): మొత్తం ప్రపంచ భవిష్యత్ క్రిటికల్ మినరల్స్‌పైనే ఆధారపడి ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. భారతదేశం తోపాటు యావత్ ప్రపంచం ఇవాళ క్రిటికల్ మినరల్స్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్నారు. భవిష్యత్ అవసరాలు, క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునేందుకు.. క్రిటికల్ మినలర్స్ చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు.

గురువారం ఢిల్లీలో ఫిక్కి ఆధ్వర్యంలో జరిగిన రెండో ఎడిషన్ క్రిటికల్ మినరల్ సదస్సును కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ...ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో.. ఎనర్జీ ట్రాన్సిషన్, గ్రీన్ డెవలప్‌మెంట్, సాంకేతిక పురోగతి అంశాలకు క్రిటికల్ మినరల్స్ అత్యంత కీలకమన్నారు. సోలార్ పానెల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, డిఫెన్స్, ఎరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఇమేజింగ్, న్యూక్లియర్ ఎనర్జీ వంటి రంగాల్లో లిథియం, కోబాల్ట్, నికెల్, కాపర్ వంటి మినరల్స్ చాలా అవసరమన్నారు. భారత్ తన అవసరాలకు 95 శాతం క్రిటికల్ మినరల్స్‌ను దిగుమతి చేసుకుంటోందన్నారు.

కొన్ని దేశాలు ఉద్దేశపూ ర్వకంగా వీటిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయ ని, దీంతో క్రిటికల్ మినరల్స్ అనేది ఒక కీలకమైన జియోపొలిటికల్ అంశంగా మారింద ని, ఇప్పుడిది భారతదేశానికి కూడా ఒక సవాలుగా మారిందని తెలిపారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. దీన్ని సవాలుగా కాకుం డా.. ఒక అవకాశంగా భావిస్తోందన్నారు. 

విదేశాల్లోని క్రిటికల్ మినరల్ ఆస్తులను దక్కించుకోవడం వరకు మొత్తం సప్లయ్ చైన్‌ను బలపరచడమే ప్రస్తుతం భారత్ ముందున్న లక్ష్యమన్నారు. దీనికితోడూ దేశీయంగా క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తిని పెంచ డంపైనా దష్టిసారించినట్లు తెలిపారు. 2014 కి ముందు దేశంలో 1,400 ఎక్స్‌ప్లోరేషన్ ప్రాజెక్టులు మాత్రమే ఉండేవని, ఈరోజు ఆ సంఖ్య 4,000 దాటిందన్నారు.

క్రిటికల్ మినరల్స్ విషయంలో విదేశాలతో ఒప్పందాలు చేసుకోవడంలో చాలా క్రియాశీల కంగా ముందుకెళ్తున్నామని, అర్జెంటీనాలో లిథియం గనిని తీసుకున్నామకని, వీలైనంత త్వరలో అక్కడ పనులు ప్రారంభించబోతున్నామన్నారు. కెనడాతో మాట్లాడుతున్నా మని, రెండ్రోజుల క్రితం ఫ్రాన్స్ గనుల శాఖ మంత్రితో సమావేశమై కీలకమైన విషయాలు చర్చించినట్లు ఆయన తెలిపారు.

క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తి, విదేశాల నుంచి సేకరించడంతోపాటు.. దేశీయంగా ఉన్న ఈ-వేస్ట్ నుంచి రీసైక్లింగ్ చేసుకోవడం కూడా.. లక్ష్యాల్లో ఒకటి అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్, భారతదేశపు కెనడా హైకమిషన్ మినిస్టర్ ఎడ్ జేగర్ తదితరులు పాల్గొన్నారు.