17 April, 2026 | 10:39 AM

దేశానికి అన్నం పెట్టే రైతు బాగుండాలి

17-04-2026 01:30 AM

ఎమ్మెల్సీ అంజిరెడ్డి

గుమ్మడిదల, ఏప్రిల్ 16 : దేశానికి అన్నం పెట్టే రైతన్నలు అన్ని విధాలుగా బాగుండాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. గుమ్మడిదల  ఎంపీపీ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. మండల ప్రత్యేక అధికారి  అధ్యక్షతన, ఎంపీడీవో ఉమాదేవి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. మండలంలోని సర్పంచులు, ఆయా శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరు అయ్యారు.

ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరై మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తున్న సబ్సిడీని ముఖ్యంగా రైతాంగానికి తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రైతులు బాగుంటే దేశం బాగుంటుందని గతంలో పనిచేసిన, చేయవలసిన పనులు, అభివృద్ధిపై చర్చించారు.

ప్రతి గ్రామంలోనూ పారిశుధ్యం, గ్రామ పంచాయతీ భవనం, రోడ్లు ముఖ్యంగా రైతుల పట్ల అవగాహన సదస్సును తదితర సమస్యలపై మాట్లాడారు.   ఎంఈవో పౌర్ణ రెడ్డి, వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రావు, పశు వైద్యాధికారి మధుకర్, ఆత్మ కమిటీ చైర్మన్ వాస్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెంటారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, మండల అధికారులు పాల్గొన్నారు.