17 April, 2026 | 12:05 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

మద్యం తాగి వాహనాలు నడపొద్దు

17-04-2026 01:31 AM

 అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా

సిద్దిపేట క్రైం, ఏప్రిల్ 16 : మద్యం తాగి వాహనాలు నడపవద్దని అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా డ్రైవర్లకు సూచించారు.  ’అరైవ్  ఆలైవ్’ ప్రోగ్రాంలో భాగంగా గురువారం సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. అతివేగంతో వాహనాలు నడిపవద్దని సూచించారు. ప్రయాణ సమయాల్లో సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని సూచించారు.

నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి తమతోపాటు ఇతరులకు హాని కలిగించవద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ను అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా అభినందించారు. సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, లారీ, స్కూల్ బస్సు, ట్రక్కులు వంటి భారీ వాహనాల డ్రైవర్లు మద్యం మత్తులో  డ్రైవింగ్ చేయవద్దన్నారు. అనంతరం డ్రైవర్ల చేత ట్రాఫిక్ నియమాలను పాటిస్తామని, మద్యం తాగి వాహనం నడపబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయడంతో పాటు సీపీఆర్ పై అవగాహన కల్పించారు.