చంద్రలోక్ కాంప్లెక్స్‌కు ఫైర్ శాఖ నోటీసులు
- అగ్నిమాపక నిబంధనల ఉల్లంఘన గుర్తింపు
- లోపాలు సరిచేయకపోతే కఠిన చర్యలు
సికింద్రాబాద్, జూలై 3 (విజయక్రాంతి): సికింద్రాబాద్లోని చంద్రలోక్ కాంప్లె క్స్లో అగ్నిమాపక భద్రతా నిబంధ నల అమలుపై ఫైర్ శాఖ అధికా రు లు సమగ్ర తనిఖీలు నిర్వహించా రు.ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఫైర్ బ్రిగేడ్ ఆధ్వర్యంలో జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీదాస్ నేతృత్వంలో అసి స్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి ప్రభాకర్ రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్ బృందం ఈ తనిఖీలు చేపట్టింది.
తనిఖీల్లో భవనంలో అగ్నిమాపక భద్రతకు సంబంధిం చిన కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని అధికారులు గుర్తించారు. దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రస్తు తం శిథిలావస్థకు చేరిందని, పలు చోట్ల పెచ్చులు ఊడిపడుతున్నా యని వెల్లడించారు. ఈ విషయా న్ని జీహెచ్‌ఎంసీ అధికారుల దృష్టి కి తీసుకెళ్లి తగిన చర్యలు చేప ట్టేలా చర్యలు తీసుకుం టామని తెలిపారు.
అలాగే భవనంలోని విద్యుత్ వైరింగ్ పూర్తిగా పాతబడి పోయి ప్రమాదకర స్థితిలో ఉండ టంతో విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందజేసి అవసరమై న చర్యలు తీసుకునేలా చూస్తామ ని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థి తుల్లో భవనంలో ఉన్న ప్రజలు సురక్షితంగా బయటకు రావడానికి తగిన వెడల్పు గల మెట్లు లేకపోవడం, భవనం చుట్టూ సెట్బ్యా క్ స్థలం లేకపోవడంతో అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టేం దుకు తీవ్ర ఇబ్బం దులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో సికింద్రాబాద్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి నిర్లక్ష్యంవల్ల తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిం చారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత దృష్ట్యా భవన నిర్వాహ కులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
నిర్ణీత గడువులోగా లోపాలను సరిదిద్దకపోతే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక భద్రతా తనిఖీలు నిరంతరం కొనసాగుతు న్నాయని, ప్రజల భద్రతే తెలంగాణ అగ్నిమాపక శాఖకు అత్యున్నత ప్రాధాన్యమని అధికారులు తెలిపారు.






