‘సర్’ను విజయవంతం చేయాలి
డిప్యూటీ కమిషనర్ శైలజ
మేడిపల్లి, జూలై 3 (విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్)2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ అన్నారు. శుక్రవారం బోడుప్పల్ సర్కిల్ ఆఫీసులో డిప్యూటీ కమిషనర్ బూత్ లెవల్ అధికారులు (బి ఎల్ ఓ లు) వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బి ఎల్ ఏ లు)తో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఓటరును సంబంధిత ఓటర్ల జాబితాలో పూర్తిగా కవర్ చేయడంతో పాటు, వారికి ఓటరు ధృవీకరణ ఫారాలను అందజేసి, నింపిన ఫారాలను తప్పనిసరిగా తిరిగి సేకరించాలని ఆదేశించారు. ఫారాలు సమర్పించని పక్షంలో సంబంధిత ఓటరు పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రతిబింబించకపోయే అవకాశం ఉందని తెలిపారు.
అలాగే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమానికి సంబంధించి ఎవరైనా ఓటరు ఫారం అందుకోకపోయినా లేదా ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నా, బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని సూచించారు. ఈ హెల్ప్ డెస్క్కు సంబంధించి శ్రీ పి. రాజేష్, వార్డు ఆఫీసర్ ఫోన్ నెంబర్ 9059688915 ను సంప్రదించవచ్చని తెలిపారు.






