రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు నాగర్తి చంద్రారెడ్డి
తాడ్వాయి, జూలై, 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు నాగర్తి చంద్రారెడ్డి డిమాండ్ చేశారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన ఆదివారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.
గతంలో ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఇప్పటికీ ఏర్పాటు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ గ్రామాన రెడ్డి ఐక్య వేదిక సంఘమును బలోపేతం చేయడానికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా యాప్ ను ఎత్తివేయాలని కోరారు.
యాప్ ను ఎత్తివేసి ఎకరాకు రెండు బస్తాలు యూరియా అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ఐక్యవేదిక కామారెడ్డి జిల్లా కన్వీనర్ జూకంటి మోహన్ రెడ్డి, తాడ్వాయి మండల అధ్యక్షులు పొద్దుటూరి నవీన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాజ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఏలేటి రామ్ రెడ్డి, నాయకులు బొక్క ప్రతాపరెడ్డి, కందడి ప్రవీణ్ కుమార్, మోహన్ రెడ్డి, మల్లారెడ్డి, రాజిరెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






