6 July, 2026 | 3:49 AM

ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్ విషయంలో శ్రద్ధ వహించి ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

06-07-2026 01:39 AM

నాగిరెడ్డిపేట్, జులై 5 (విజయక్రాంతి): మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్న రాజులు బిజెపి నాయకులతో.. కార్యకర్తలతో కలిసి పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ.. ఎస్.ఐ.ఆర్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాలలో బిఎల్‌ఎటుగా కార్యకర్తలను నియమించడం జరిగిందని వీరు గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ప్రజలకు సహకరించడం జరుగుతుందన్నారు. అలాగే చనిపోయినటువంటి వారి యొక్క ఓటును తొలగింపు, నూతనంగా వివాహమైనటువంటి స్త్రీల ఓటును చేర్చే విధానంలో కార్యకర్తలు అందరూ శ్రద్ధ వహించవలసిందిగా తెలియజేయడం జరిగింది.

ప్రతి ఒక్కరు కూడా ఎస్.ఐ.ఆర్ విషయంలో శ్రద్ధ వహించి ఓటు హక్కు నమోదు చేసుకో వాల్సిందిగా తెలిపారు. అధికారులకు సహకరిస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా చేయవలసిందిగా కార్యకర్తలకు, నాగిరెడ్డిపేట మండల ప్రజల కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమాన్లు, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు భాస్కర్,కిషన్, ఉపాధ్యక్షులు ఈశ్వర్ గౌడ్, శేఖర్, వివేక్ రెడ్డి, నాయకులు శెట్టిగారి అంజయ్య, దుర్గయ్య, రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.