రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారే
- కేంద్ర మంత్రి బండి సంజయ్
- ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి అమీర్‌పేట వరకు బైక్ ర్యాలీ
- రేపు మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపు
సికింద్రాబాద్/ముషీరాబాద్, మే 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడటం ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే ప్రధాని మోదీ సభ ను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం బీజేపీ కార్యకర్తలతో కలిసి ముషీరా బాద్ చౌరస్తా నుంచి సికింద్రాబాద్ మీదుగా అమీర్‌పేట వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో బండి సంజయ్, ఏంపీ డాక్టర్ కే లక్ష్మణ్, సికింద్రాబాద్ జిల్లా బీజేపీ కన్వీనర్ భరత్ గౌడ్‌తోపాటు వందల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మోదీ సభ ను విజయవంతం చేయడానికి తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో వేలాది కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించి ప్రజల ఆశీర్వాదం కోసం ప్రధాని మో దీ బహిరంగ సభలో పాల్గొంటున్నారని తెలిపారు.
పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ విషయంపై స్పందిస్తూ ‘అధికారంలో ఉన్నప్పు డు మీరు ఎవరిని పట్టించుకోలేదు. అధికారం పోయిన తర్వాత కార్యకర్తల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదు ర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు.






