9 May, 2026 | 4:52 AM

తాండ్ర లలితాదేవి మృతి పట్ల సంతాపం

09-05-2026 01:31 AM

పలువురి నివాళి

ములకలపల్లి,మే 8 (విజయక్రాంతి): దివంగత నాయకుడు,ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు,భద్రాచలం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు, ములకలపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాండ్ర నారాయణరావు సతీమణి లలితా దేవి మృతి పట్ల పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం ప్రకటించారు. ఆమె అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆమె పార్థివదేహాన్ని సొంత గ్రామమైన మండలంలోని పొగళ్లపల్లి గ్రామానికి తీసుకొచ్చారు.

ఈ విషయం తెలుసుకున్న పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు శుక్రవారం ఆమె పార్ధీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే,బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మెచ్చ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి, ఉపాధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, ములకలపల్లి మండల నాయకులు కరుటూరి కృష్ణ, పాలకుర్తి రత్న భూషణం,శనగపాటి రవి,గాడి తిరుపతిరెడ్డి,సిపిఐ నాయకులు నరాటి ప్రసాద్,

బిఆర్‌ఎస్ నాయకులు మోరంపూడి అప్పారావు, బండి కొమరయ్య, తాండ్ర రాంబాబు, శనగపాటి సీతారాములు, తాండ్ర లక్ష్మణ్ రావు తదితరులు నివాళులర్పించారు. టి ఎన్ ఆర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారి కుమారుడైన ఎన్‌ఆర్‌ఐ తాండ్ర వెంకటేశ్వరరావును, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.