30 August, 2026 | 11:47 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

వరి కొయ్యలకు నిప్పు

22-05-2026 12:38 AM

భారీగా పంటలకు నష్టం 

మహబూబాబాద్ జిల్లాలో పలుచోట్ల అగ్నిప్రమాదం 

మహబూబాబాద్, మే 21 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో గురు వారం వేర్వేరు చోట్ల వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి మిర్చి, మొక్కజొన్న పంటలు దగ్ధమై లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని దంతాలపల్లి మండలం దుబ్బ తండాలో ఆజ్ఞ ప్రమాదం సంభవించి 20 ఎకరాల్లో పదిమంది రైతులకు చెందిన మొ క్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైందని, సుమా రు 15 లక్షల రూపాయల పంట కాలి బూడి ద అయిందని రైతులు వాపోతున్నారు.

కేసముద్రం మండలం అర్పణ పల్లి గ్రామంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం వల్ల కళ్లంలో ఆరబోసిన మిర్చి పంట కాలిపోవడంతో పాటు, ధాన్యం, వ్యవసాయ పరికరా లు కాలిపోయాయి. చిట్టే కుమారస్వామికి చెందిన పది క్వింటాళ్ల మిర్చి పంట అగ్నికి ఆహుతయ్యింది. వరి కోయ్యలు అగ్ని ప్రమాదానికి గురై వేగంగా విస్తరిస్తూ ఉండడానికి గమనించిన యువకులు వెంటనే నీటి ట్యాం కర్లతో నీళ్లు తెచ్చి మంటలను అదుపులోకి తేవడంతో అగ్ని ప్రమాద తీవ్రత తగ్గింది.