అన్నారంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత
ఉపాధి హామీలో 19 పనులకు 50 లక్షల నిధులు.
పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఉపాధి హామీ ఆడిట్ సమావేశాన్ని నిర్వహించిన వైనం.
తుంగతుర్తి( విజయ క్రాంతి): అన్నారంలో ఉపాధి హామీ పనులపై గ్రామపంచాయతీ ఎదుట సమీక్ష సమావేశం జరుగుతుండగా కాంగ్రెస్ ,బిఆర్ఎస్ నాయకుల మధ్య మాటలతో, తూటాలు పెరిగి, ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామపంచాయతీ పరిధిలో 2024_ 25 గాను ఉపాధి హామీ పనులపై, సమీక్ష సమావేశాన్ని సోషల్ ఆడిట్ డిఆర్పి ప్రకాష్ నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో గ్రామపంచాయతీ సమీపంలో గతంలో రాళ్లు, వైర్లతో చుట్టిన ఖాళీ స్థలన్ని, సంబంధిత గ్రామపంచాయతీ సిబ్బంది, జిల్లా డిపిఆర్ ఆదేశాల మేరకు తొలగింపు ప్రక్రియ జరుగుతుండగా, కాంగ్రెస్ నాయకులు, టిఆర్ఎస్ నాయకుల మధ్య మాటలతో, తూటాలు పెరిగాయి. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇరువురిని శాంతింప చేసి సమీక్ష సమావేశాన్ని కొనసాగించారు. జిల్లా నుండి అధికారులు వచ్చి చర్యలు తీసుకునేదాకా ఎవ్వరు ఈ స్థలంపై కొట్లాడవద్దని పోలీసులు హెచ్చరించారు.
మొత్తం గ్రామములో 19 ఉపాధి హామీ పనులకు గాను, సుమారు 50 లక్షలు వెచ్చించినట్లు అధికారులు తెలిపారు. ఈ పనుల్లో కొన్ని అవకతవకలు ఉన్నాయని, చేయని పనులకు, చేయని సంతకాలకు డబ్బులు తీసుకున్నట్లు, నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. దీనితో ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని, జరిగిన సంఘటనపై, జిల్లా డిఆర్డిఏ అధికారులకు తెలుపనున్నట్లు అధికారి పేర్కొన్నారు. గ్రామంలోని ప్రజా సమస్యలను గాలికి వదిలి, ఇరువర్గాలు, స్థలంపై కొట్లాడం, విడ్డూరంగా ఉందని, ప్రజలు వాపోయారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ మండల, జిల్లా అధికారులతో మాట్లాడి గ్రామంలో ఎక్కువ మంది కూలీలకు ఉపాధి హామీ పనులు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ కవిత, వార్డు మెంబర్లు బింగి వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
రాజ్యసభ ఎన్నికలు.. రాష్ట్రంలో 3 నామినేషన్లు దాఖలు




