31 July, 2026 | 3:27 AM

ఆపిల్ పండ్ల లూటీ

31-07-2026 02:21 AM
  1. డీసీఎం ప్రమాదాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు
  2. వరంగల్ రహదారిపై ఘటన

మహబూబాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ఆపిల్ పండ్ల వాహనం బోల్తా కొట్టడంతో సమీప గ్రామప్రజలు ప్రమాదంలో ఉన్న వారిని కాపాడిల్సిందిపోయి సంచులలో ఆపిల్‌లను దోచుకుపో యారు. ఈ చర్యలు పలు విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆపిల్ పండ్ల లోడుతో గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండ లం మాటేడు గ్రామం మీదుగా వెళుతున్న ఓ డీసీ ఎం అదుపుతప్పి వరంగల్ జాతీయ రహదారిపై బోల్తా కొట్టింది. వ్యాన్ డ్రైవర్ ప్రమా దం నుంచి బయటపడ్డాడు.

డీసీఎం వ్యాన్ రోడ్డు పక్కన బోల్తాపడడాన్ని చూసిన సమీప గ్రామ ప్రజలు దారి వెంట వెళ్తున్న వాహనదారులు సం దట్లో సడే మియా అన్న చందంగా అందిన కాడికి ఆపిల్ పండ్లను దోచుకెళ్లారు. కొందరైతే ఏకంగా బస్తాల్లో నింపుకొని మరి ఎత్తుకెళ్లారు. ప్రమాదం లో ఆస్తి నష్టం జరిగితే కనీసం వారికి సహకరించాల్సిన పరిస్థితికి భిన్నంగా కొందరు వ్యవహరించిన తీరు, డీసీఎం వద్ద ఎగబడి మరి ఆపిల్ పండ్లను లూఠీ చేయడం విమర్శలకు తావిస్తోంది. పెద్ద ఎత్తున జనం అక్కడికి తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.