మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు
సమత పుట్టింటి సారే 5116 రూపాయలు అందజేత
సుల్తానాబాద్, (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ(Sulthanabad Municipality) 3వ వార్డ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా,మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే, పేదింటి ఆడబిడ్డల వివాహ వేడుకలకు అండగా నిలిచేందుకు "సమత పుట్టింటి సారె" పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.ఈ పథకంలో భాగంగా గురువారం పోసాని రవీందర్ -రాజేశ్వరి ల కుమార్తె మానస వివాహానికి రెండు రోజుల ముందే 5,116/- నగదును సమత పుట్టింటి సారె కింద అందజేశారు.
ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ కందునూరి సమత కుమార్ లు మాట్లాడుతూ ఆడబిడ్డల పెళ్లి అనేది ఆ కుటుంబానికి ఎంతో వేడుకతో కూడుకున్న విషయం. ఆ సమయంలో పుట్టింటి వారు ఇచ్చే 'సారె 'కి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.అందుకే, ఒక అన్నగా, తమ్ముడిగా వారి పెళ్లి వేడుకలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో, పెళ్లి ఖర్చులకు సాయంగా ఈ మొత్తాన్ని రెండు రోజుల ముందే అందజేస్తున్నాం" అని వారు తెలిపారు.కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ పేద కుటుంబాలకు అండగా ఉంటున్నామని, అర్హులైన ప్రతి పేదెంటి ఆడబిడ్డకు ఈ పథకం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ బిడ్డ పెళ్లికి రెండు రోజుల ముందే ఆర్థిక సాయం అందడంపై లబ్ధిదారు కుటుంబం హర్షం వ్యక్తం చేస్తూ కందునూరి సమత కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు....




