31 July, 2026 | 12:47 AM

మేడ్చల్ జిల్లాలో భారీగా తగ్గనున్న ఓటర్లు

31-07-2026 12:00 AM

ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు మిగిలింది నాలుగు రోజులే 

ఇప్పటివరకు అందినవి 60 శాతమే 

2002 ఓటరు జాబితాతో ఇబ్బంది..

సొంతూళ్లలో ఓటుహక్కుపై ఆసక్తి 

మేడ్చల్, జూలై 30 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు బిఎల్ఓ లకు అందించడానికి ఓటర్లు చాలామంది ఆసక్తి చూపడం లే దు. సొంతూళ్లలో ఓటును కాపాడుకోవడమే గాక, 2002 ఓ టర్ల జాబితాతో మూడు పెట్టడం వల్ల అనేకమంది ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడం లేదు.

జిల్లాలో మేడ్చల్, మల్కాజిగిరి, కుతుబుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాలున్నా యి. ఈ ఐదు నియోజకవర్గాలలో 2979130 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 18 లక్షల మంది మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు అందించారు. అంటే 60 శాతం ఫారాలు బిఎల్ ఓ లకు అందాయి. ఇంకా 40% వరకు అందాల్సి ఉంది. ఇం కా గడువు కేవలం నాలుగు రోజుల మాత్రమే ఉంది. ఈ నా లుగు రోజుల్లో 40% ఫారాలు అందే అవకాశం లేదు. ఆగస్టు మూడవ తేదీన గడువు ముగియనుంది. అప్పటివరకు ఫారా లు అందించిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది.

సొంతూళ్లకే ప్రాధాన్యం 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మినీ భారత్ ను తలపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల వారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నివసిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారు. వీరందరికీ ఇక్కడ ఓటు హక్కు ఉండడంతో పాటు వారి స్వస్థలాల్లో కూడా ఓటు హక్కు ఉంది.

వీరిలో చాలామంది స్వస్థలాల్లో ఓటరుగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. స్వస్థలాల్లో మొత్తం ఆస్తులు అన్ని విక్రయించి నగరానికి వచ్చిన వారు మాత్రమే ఇక్కడ ఓటరుగా నమోదు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా సర్ కార్యక్రమం జరుగుతోంది. జిల్లాలో ఎక్కువగా ఏపీ వారే ఉన్నారు. వారు వారి సొంతూళ్లలో ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు.

2002 ఓటరు జాబితాతో ముడి పెట్టడంతో ఇబ్బంది 

2002 ఓటరు జాబితాతో ముడి పెట్టడం వల్ల అనేకమంది ఇబ్బంది పడుతున్నారు. 2002 ఓటరు జాబితా అంటే 24 ఏళ్ల కిందటిది. అప్పట్లో ఓటు హక్కు లేని వారు చాలామంది ఉన్నారు. వారి తల్లిదండ్రులకు ఎక్కడ ఓటు హక్కు ఉందో తెలియదు. ఇతర రాష్ట్రాల వారికి ఇది మరింత ఇబ్బందికరంగా తయారైంది. ఇలాంటి సమస్యల వల్ల కూడా స్థానికంగా ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. 

ఆసక్తి చూపని పార్టీలు 

రాజకీయ పార్టీలు సర్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ స్థానికంగా ఆయా పార్టీల నాయకులు అంతగా పట్టించుకోవడం లేదు. నాయకులనుంచి బూత్ లెవెల్ ఏజెంట్లకు సరైన ప్రోత్సాహం అందడం లేదు. దీంతో వారు అంతగా శ్రద్ధ చూపడం లేదు. అన్ని పార్టీల పరిస్థితి ఇలాగే ఉంది. నాయకులే ప్రోత్సాహం ఇవ్వనందున మనకెందుకులే అని బిఎల్‌ఏలు ఊరుకుంటున్నారు.