31 July, 2026 | 2:03 AM

ఈ రహదారిపై ప్రయాణం..ప్రాణాలతో చెలగాటం

31-07-2026 01:03 AM
  1. ప్రమాదకరంగా ఆళ్ళపల్లి నుండి జిల్లా కేంద్రానికి  వెళ్ళే రహదారి                       
  2. నిత్యం బారీ వాహనాల రాకపోకలతో రహదారి ధ్వంసం
  3. ఏడాది కాలంలో అనేక రోడ్డు ప్రమాదాలు.
  4. డబుల్ రోడ్డు మంజూరు చేయాలని మండల ప్రజలు విజ్ఞప్తి

ఆళ్ళపల్లి, జూన్30, (విజయక్రాంతి):ఆళ్లపల్లి నుండి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. నిత్యం అనేక వాహనాల రాకపోకలతో ని త్యం రద్దీగా ఉండే రహదారి ప్రమాదాలు కారణ భూతం గా మారింది. మండలంలో జరుగుతున్న అనేక అభివృద్ధి నిర్మాణాలకు సిమెంటు కంకరు తదితర సామాగ్రిని భారీ వాహనాలు ఓవర్ లోడ్ తో మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి మద్య రాకపోకలు సాగిస్తున్నాయి.

ఈ క్రమంలో లో రహదారి పూర్తిగా ధ్వంసమై ప్రజలకు తిప్పలు త ప్పడం లేదు. అసలే సింగిల్ రోడ్ దానికితో డు మూలమలుపుల వద్ద దట్టంగా పెరిగిన చెట్లు ఎదురుగా వచ్చే వాహనాన్ని తెలుసుకునే లోపే ప్రమాదాలు జరుగుతున్నాయి. మండల పరిధిలోని,ర్కోడు,అనంతోగు, రా యపాడు, పాతూరు, రామంజిగూడెం, నడింగూడెం, అడవిరామారం, దొంగతోగు, రాగాపురం, పంచాయతిపరిదిలోని సుమారు 30 గ్రామాల ప్రజలు, గుండాల మండలం నుండి 30 గ్రామాల ప్రజలు అనేక అవసరాలకు జిల్లా కేంద్రానికి నిత్యం ఈ రహదారి గుండానే ప్రయాణిస్తున్నారు. సింగిల్ రోడ్డుకు తోడు గుంతల మయంగా మారడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగు తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంది.

ఇక ఆ టోల్లో ప్రయాణించే వారి కష్టాలు వర్ణనాతీతం  ఈ రహదారి గుండా ప్రయాణించే క్ర మంలో అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిం చి కొందరు మృత్యువాత పడగా, కొందరు గాయాలపాలయ్యారు. ఇదే రహదారి గుండా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ప్రమాదాల బారిన పడ్డాయి. ఆళ్ళపల్లి నుండి అనిశెట్టిపల్లి 35 కిలో మీటర్ల దూరం, అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు క్షతగాత్రులు వైద్యం కోసం జిల్లా కేంద్రానికి వెళ్ళా లంటే సుమారు రెండుగంటల సమయం పడుతుండటంతో కొందరు సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకోలేక మార్గమధ్యం లోనే ప్రాణాలు విడిచిన సందర్భాలున్నాయి .

,ప్రమాదకరంగా ఉన్న రహదారిని అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని , ఓ వైపు ప్రమాదాల జరుగుతున్న అధికారులు ,చూసీచూడనట్లు వ్యవహరించడం పై మండల ప్రజల నుండి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి డబల్ రోడ్డు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఏ మార్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రాతనిజం వహించటం కోసం మెరుపు.