31 July, 2026 | 3:27 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

31-07-2026 02:24 AM

కల్వకుర్తి, జూలై 30: కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఇంగ్వినో-స్క్రోటల్ హెర్నియాతో బాధపడుతున్న శ్రీరామ్ రెడ్డికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. జనరల్ సర్జన్ యశోద నేతృత్వంలో, డాక్టర్స్ హరీష్, మాధురి, శ్రీను సహకారంతో ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స పూర్తి చేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నిపుణులైన వైద్యులతో నాణ్యమైన సేవలు అందుబాటులో ఉన్నా యని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.