రాజ్యసభ ఎన్నికలు.. రాష్ట్రంలో 3 నామినేషన్లు దాఖలు
ముగిసిన రాజ్యసభ ఎన్నికల నామినేషన్ పక్రియ
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పక్రియ ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యసభ(Rajya Sabha election nomination) ఎన్నికలకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ తరుఫున వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మనుసింఘ్వీ నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికకు ఇతర పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు కాలేదు. స్వతంత్ర అభ్యర్థి సాయి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. స్క్రూటినీలో స్వంతంత్ర అభ్యర్థి నామినేషన్ ఆర్ వో తిరస్కరించే అవకాశముంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి తెలంగాణ శాసనసభకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అసెంబ్లీకి వెళ్లారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాజ్యసభలో రెండోసారి అవకాశం లభించడం తన అదృష్టమని అభిషేక్ సింఘ్వి అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు వేం నరేందర్ రెడ్డి అగ్ర నాయకత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ
ఫర్నీచర్ దుకాణం యజమాని బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వు




