హోటళ్ళు, రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్స్ దాడులు
16 సిలిండర్లు సీజ్, పలువురిపై కేసులు నమోదు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లై అధికారులు దాడులు కలకలం సృష్టించాయి. బుధవారం బెల్లంపల్లిలో పలు దుకాణాలపై ఆకస్మికంగా దాడులు చేశారు. హైదరాబాదు నుంచి వచ్చిన ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు వంటగ్యాస్ నిబంధనల దుర్వినియోగంపై తనిఖీలు చేశారు.
పట్టణంలోని రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తదితర వ్యాపార దుకాణాలల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కమర్షియల్ వంట గ్యాస్ కు బదులు గృహ అవసరాలకు వినియోగించే పంట గ్యాస్ సిలిండర్ల వినియోగం లక్ష్యంగా సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 16 సిలిండలను స్వాధీన చేసుకొని సీజ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారుల పై అధికారులు కేసులు నమోదు చేశారు.




