రైస్ మిల్లుల పరిశ్రమను ఆదుకోండి
సీఎంకు రైస్ మిల్లుల అసోషియేషన్ అధ్యక్షుడి విజ్ఞప్తి
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): కష్టాల్లో ఉన్న రైస్ మిల్లుల పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న రైసు మిల్లర్లందరికీ ధాన్యం కేటాయించి రైసుమిల్లుల పరిశ్రమను సీఎం రేవంత్‌రెడ్డినే కాపాడాలని ప్రకనటలో కోరారు.
రాష్ట్రంలోని దాదాపు 400 వరకు ఉన్న రైసు మిల్లులు 100 శాతం బియ్యం సరఫరా చేసి కూడా 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ చేసి డిపాల్ట్‌లో లిస్టులో ఉన్నాయని, ఆ మిల్లర్లపై ఉన్న పెనాల్టీ, వడ్డీ మాఫీ చేయాలని, రబీ ధాన్యం కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డికి గణపతి రెడ్డి విజ్ఞప్తి చేశారు. తమ రైసు మిల్లర్ల సమస్యలను క్యాబినెట్ సమావేశంలో పెద్ద మనసుతో చర్చించి పరిశ్రమను కాపాడాలని కోరారు.






