4 May, 2026 | 1:10 AM

గ్యాస్ సిలిండర్!

04-05-2026 12:00 AM
  1. గోదాము వద్దే గృహ వినియోగదారుల నిద్ర
  2. మహబూబాబాద్ జిల్లా నరసింహుల పేటలో ఘటన

మహబూబాబాద్, మే 3 (విజయక్రాంతి): గ్యాస్ సిలిండర్ల కోసం గృహ వినియోగదారులు గోదాము వద్దే రాత్రంతా నిద్రించి నిరీక్షించిన ఘటన మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో జరిగింది. స్థానిక భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల అలసత్వం, నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా తమకు గత నెల రోజులుగా సక్రమంగా గ్యాస్ సరఫరా చేయడం లేదని, ఆదివారం ఉదయం గ్యాస్ గోదాముకు గ్యాస్ సిలిండర్ల లారీ వస్తుందని సమాచారం అందుకున్న వందల మంది వినియోగదారులు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో శనివారం రాత్రి గోదా ము వద్దకు చేరుకొని వరుస క్రమం లో సిలిండర్లను ఉంచి అక్కడే నిద్రించారు.

పోలీసులు అక్కడికి చేరుకొని ఆదివారం గోదాముకు వచ్చిన గ్యాస్ సిలిండర్లను ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేశారు. మరి కొంతమందికి మళ్లీ లోడ్ రాగానే అందజేస్తామని తెలిపారు. అయితే గత నెల రోజుల నుంచి ఈ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సక్రమంగా వినియోగదారులకు గ్యాస్ పంపిణీ చేయడం లేదని, చాలా రోజులుగా సమస్య లేవనెత్తినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సక్రమంగా గ్యాస్ పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.