చిన్నారులపై వీధి కుక్కల దాడి..
23-03-2026 12:49 AM
హైదరాబాద్ నిలోఫర్‌కు తరలింపు
దోమకొండ, మార్చి 22, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని చింతమాన్ పల్లి గ్రామంలో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. గ్రామంలో ఇద్దరు చిన్నారులు ఆదివారం బయట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో అటువైపుగా వెళ్తున్న కుక్కలు చిన్నారులపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఐదేళ్ల చిన్నారి హర్షిని, 16 నెలల చిన్నారి జాహ్నవిలను జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చిన్నారుల పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఇద్దరిని హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.




