23 March, 2026 | 9:18 AM

నిజామాబాద్ యార్డులో పసుపు చోరీ!

23-03-2026 12:50 AM
  1. క్వింటాళ్ల కొద్ది మాయం       

నలుగురి వ్యాపారస్తుల లైసెన్స్ సస్పెండ్      

నిజామాబాద్, మార్చి 22(విజయక్రాం తి): నిజామాబాద్ జిల్లాలోని మార్కెట్ యా ర్డుకు రైతులు తరలించిన పంట క్వింటాళ్లకొద్దీ చోరీకి గురవుతున్న సంఘటన రైతుల్లో తీవ్ర కలకలం రేపింది. ఒకవైపు పసుపు కొ నుగోలు లేకపోవడం మరోవైపు వాతావర ణ మార్పు ఈ నామ్ మొరాయింపు, కొనుగోలు నిలిచిపోవడం, తదితర అంశాలతో కొ ట్టుమిట్టాడుతున్న జిల్లా పసుపు రైతాంగానికి ఇంటి దొంగల బెడద మొదలైంది.

మార్కెట్ యార్డ్ తెచ్చిన పంట చోరీకి గురవుతుండడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ఈ సంఘటనకు సంబంధించి పసు పు చోరీకి పాల్పడిన మార్కెట్ కమిటీ లోని కమీషన్ ఏజెంట్లపై విచారణ జరుగుతోంది. దర్యాప్తులో తేలిన ప్రాథమిక సమాచారం మేరకు ఇద్దరి కమీషన్ ఏజెంట్ల లైసెన్సు స స్పెండ్ చేసినట్టు విశ్వాసనీయ సమాచారం. ఇటీవల జరుగుతున్న గల్ఫ్ యుద్ధ సంక్షోభంతో ఎగుమతులు నిలిచిపోయాయి.

దీం తో మార్కెట్ యార్డుకు తెచ్చిన పసుపు కొ నుగోళ్లు నిలిచిపోయాయి. అయితే పొరుగున ఉన్న మహారాష్ట్ర, సాంగ్లీ, తమిళనాడు లో పసుపు అధిక సంఖ్యలో రైతులు ఏ సమ స్య లేకుండా తమ పంట కొనుగోలు ఎగుమతులు జరుగుతున్నాయి. కానీ నిజామా బాద్ జిల్లాలోని గత పది రోజులుగా పసుపు రైతులు నానాయాతన పడుతున్నారు. ఇప్పటికే మార్కెట్ కమిటీ లో 30 వేల బస్తాలకు పైగా ఉన్న పసుపుకి అదనంగా మరో 8, 9 వేల వరకు బస్తాల పసుపు వచ్చి చేరింది. కొనుగోలు నిలిచిపోవడంతో పసుపు కల్లాలతో మార్కెట్ కమిటీ నిండిపోయి కళకళలా డుతోంది.

ఇదే అదనుగా చేసుకున్న కొంద రు అర్తి దుకాణం యజమానులు పసుపు చోరీలకు పాల్పడుతున్నారు. క్వింటాళ్ల కొద్ది పసుపు చోరీకి గురవుతున్న విషయాన్ని గమనించిన కొందరు రైతులు మార్కెట్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.ఈ పసుపు చోరీకి సంబంధించి రెండు నుంచి నాలుగు దుకాణాలకు సంబంధించిన లైసెన్సులను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది.

సస్పెండ్ కాకుండా వారిని పూర్తిగా మార్కెట్ యార్డులో నుంచి తరిమివేయాలని వారి లైసెన్సులను రద్దు చేసి  రైతులను ఆదుకోవాలని. పసుపు పంటలకు వెంటనే సరైన రేటు కల్పించి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా పసు పు పంట మార్కెట్ యార్డ్ తరలించిన రైతు లు రోజుల తరబడి కళ్లాల వద్ద నిరీక్షిస్తుండగా కష్టార్జితమైన తమ పసుపు పంటను రెప్పపాటులో మార్కెట్ యార్డులో నుండి చోరీకి పాల్పడుతుండడం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ విషయమై మార్కెట్ కమిటీ చోరీకి పాల్పడుతున్న వ్యాపారస్తులపై క్రిమినల్ కేసులు బుక్ చేసి వారిని శాశ్వ తంగా మార్కెట్ వ్యాపారం నుంచి తొలగించాలని పసుపు రైతులు కోరుతున్నారు. కాగా మరో నాలుగు షాపులపై విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.

యార్డులోని పసుపు చోరీకి పాల్పడడం, పం టను ఎత్తుకెళ్లిన వారికి సంబంధించిన దుకాణ సముదాయంలో చేర్చడం తదితర దృ శ్యాలన్నీ సీసీటీవీల్లో రికార్డ్ అయినవి కమిటీకి చిక్కినట్టు  విశ్వాసనీయ సమాచారం.ఈ విషయ మై మార్కెట్ కమిటీ అధికారులను సం ప్రదించడానికి విజయక్రాంతి ప్రయత్నించ గా మార్కెట్ కమిటీ నిర్వాహకులు కానీ అ ధికారులు కాని  ఎవరు అందుబాటులో లేరు.