16 August, 2026 | 11:37 PM

Districts - Nizamabad

article_39769276.webp
అడ్లూరి శ్రీనివాస్ ను పరామర్శించిన మేడపాటి ప్రకాష్ రెడ్డి

బోధన్ ఆగస్టు 16(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ అడ్డూరి శ్రీనివాస్ తండ్రి మల్లయ స్వర్గీయులు అయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి చిత్రపటానికి పూల మాలవేసి శతాంజలి ఘటించారు . బీజేపీ రాష్ట్ర నాయకులు అడ్లూరి శ్రీనివాస్ తండ్రి అడ్లూరి మల్లయ్య కొన్ని రోజుల క్రితం స్వర్గస్తులయ్యారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి పరామర్శించారు, అలాగే సీనియర్ రిపోర్టర్ తడప.అబ్బయ్య ,శంకు.స్థాయిలు రిపోర్టర్, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారితోపాటు బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపికిషన్ నాయకులు తదితరులు ఉన్నారు.

16-08-2026

article_14517287.webp
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు

నిజామాబాద్,ఆగస్టు 15 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మీదట, పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతిని నివేదిస్తూ, ప్రజనుద్దేశించి ప్రసంగించారు.

15-08-2026

article_47166290.webp
పోలీస్ పరేడ్ గ్రౌండ్స 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా జరిగిన ఈ వేడుకలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు వందనం చేశారు. అనంతరం పోలీసు బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసు బృందాల కవాతును ఆయన పరిశీలించారు.

15-08-2026

article_29455510.webp
ఊటుపల్లి గ్రామంలో సగం జాతీయ జెండా ఎగురవేతపై వివాదం

బోధన్, ఆగస్టు 15 (విజయక్రాంతి): బోధన్ మండలం ఊటుపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను జాతీయ జెండాను సగం స్థాయిలో ఎగురవేయడాన్ని “అర్ధనిమజ్జనం” అంటారు. సాధారణంగా దేశంలో విషాద సందర్భాలు, ప్రముఖుల మరణం వంటి ప్రత్యేక సందర్భాల్లో గౌరవ సూచకంగా జాతీయ జెండాను అర్ధనిమజ్జనంలో ఉంచుతారు. జాతీయ జెండాను అర్ధనిమజ్జనంలో ఎగురవేశారు. సగం మేరకు ఎగురవేయడంపై వివాదం నెలకొంది. గ్రామ సర్పంచ్ బోయి ప్రశాంతి జాతీయ జెండాను సగం మేరకు ఎగురవేశారని గ్రామ ఉపసర్పంచ్ నరేందర్ గౌడ్, వార్డు సభ్యులు ఆరోపించారు. జాతీయ జెండాను సగం మేరకు ఎగురవేయడం జాతీయ పతాకానికి అవమానకరమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

15-08-2026