క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
డీఎస్‌డీఓ వెంకటరెడ్డి
కోదాడ, మే 8: సూర్యాపేట జిల్లా యువజన క్రీడా సమైక్య శాఖ వారి ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ క్రీడాంశాల శిక్షణ శిబిరాలను యువత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డి ఎస్ డి ఓ వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని వేసవి ఉచిత వాలిబాల్ శిక్షణ శిబిరం పట్టణ పరిధి కొమరబండలోని బాస్కెట్బాల్ శిబిరం నడిగూడెం కబడ్డీ శివాను వారు సందర్శించి అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
శిబిరంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి యొక్క పేరును ఆన్లైన్లో నమోదు చేయాలని అదే విధంగా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని వారు సూచించారు అనంతరం విద్యార్థులకు దాతల సహకారంతో అందిస్తున్న పౌష్టికాహార పంపిణీ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ శిబిరాల కోచిలు సీనియర్ పీడీలు వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.






