calender_icon.png 16 February, 2026 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతికే పురపగ్గాలు..

16-02-2026 04:37:01 PM

"విజయ క్రాంతి" ముందే చెప్పింది

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో చేతికే పురపగ్గాలు దక్కుతాయని విజయ క్రాంతి దినపత్రిక ముందే చెప్పింది. బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్, వైస్ చైర్మన్ కోసం మారిన సమీకరణ ల విశ్లేషణతో ఎన్నికలకు ఒక రోజు ముందే విజయ కాంతిలో "చేతికే పురపగ్గాలు "అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఫలితాలు కథనం లో పేర్కొన్నట్టే కాంగ్రెస్ పార్టీ పురపాలక పగ్గాలను సొంతం చేసుకుంది. బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గా దావ స్వాతి, వైస్ చైర్మన్ గా రాగం శెట్టి సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సోమవారం మున్సిపల్ కార్యాలయం సమావేశం మందిరంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్, ప్రత్యేక అధికారి మనోజ్ సమక్షంలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. చైర్‌పర్సన్ పదవికి జరిగిన ఎన్నికలో ఇండిపెండెంట్ సభ్యులు– 05, బీజేపీ– 01, కాంగ్రెస్– 14, ఎక్స్ ఆఫీసియో సభ్యుడు ఎమ్మెల్యే గడ్డం వినోద్– 01 ఓటు కలిపి మొత్తం 21 ఓట్ల మద్దతుతో కాంగ్రెస్  చైర్‌పర్సన్‌ స్వాతి దావా స్వాతి ఎన్నికయ్యారు.

అదేవిధంగా, వైస్ చైర్‌పర్సన్ పదవికి జరిగిన ఎన్నికలోనూ ఇండిపెండెంట్ సభ్యులు– 05, బీజేపీ– 01, కాంగ్రెస్– 14, ఎక్స్ ఆఫీసియో సభ్యుడి– 01 ఓటుతో  21 ఓట్ల మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి  వైస్ చైర్‌పర్సన్‌గా రాగంశెట్టి సత్యనారాయణ ఎన్నికయ్యారు. చైర్ పర్సన్, వైస్ చైర్మన్ జోడూ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోన్నది. ఈ ఎన్నికను బెల్లంపల్లి సబ్ కలెక్టర్, ప్రత్యేక అధికారి మనోజ్ వెల్లడించారు. ఎన్నిక సుఖంతం కావడంతో క్యాంపుల రాజకీయాలకు తెరపడింది. రాజకీయ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.