16-02-2026 04:29:15 PM
జాతరలో ఏర్పాటుచేసిన రంగులరాట్నం
వాంకిడి,(విజయక్రాంతి): మహాశివరాత్రి సందర్భంగా వాంకిడి మండల కేంద్రంలోని చిక్లీ వాగు తీరాన సోమవారం రెండవ రోజు జాతర కొనసాగుతుంది. జాతరకు వాంకిడి మండలంలోని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు మాత్రమే కాకుండా సమీపంలోని మహారాష్ట్ర, నుంచి జాతరకు వస్తున్నారు. వాంకిడిలో రెండవ రోజు కొనసాగుతున్న జాతర జనసంద్రమైంది. జాతరకు వచ్చిన జనం తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేశారు. యువకులు టాటు, రంగులరాట్నం ఉయ్యాలలు ఊగారు. మహిళలు అవసరమైన గాజులు, బోళ్ల, చిన్నపిల్లలకు ఆట వస్తువులు కొనుగోలు చేయడంతో దుకాణాలు కిక్కిరిసిపోయాయి.