అయ్యా ఎమ్మెల్యే, సార్ ఆ సంఘటన అబద్ధమా
అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడింది, పచ్చి నిజమే
అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోమార్పేట్ గ్రామస్తులు
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): మంగళవారం అసెంబ్లీలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడిన తీరుపై మండలంలోని సోమార్ పేట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామస్తులు ఎమ్మెల్యే పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గ్రామంలో జరిగిన సంఘటనలు పూర్తిగా తెలుసుకోకుండా అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఆయనకు తగదని పలువురు గ్రామస్తులు మండిపడ్డారు.
ఎల్లారెడ్డి మండలంలో సర్పంచ్ ఎన్నికల అనంతరం బరిలో ఉన్న ప్రత్యర్థి పై ట్రాక్టర్ తో దాడి చేయడం గ్రామస్తుల కళ్ళకు కట్టినట్టు కనిపించిన అబద్ధం అబద్దం అని అసెంబ్లీ సాక్షిగా గర్జించిన శాసనసభ్యులు ఎమ్మెల్యే మదన్మోహన్ సార్ గారు, మీరు మాట్లాడి దాంట్లో వాస్తవమే లేదు. తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఎల్లారెడ్డి గడ్డమీద జరిగిన సంఘటనపై చర్చించితే ఎందుకంత ఆత్రుతతో ఆగ్రహంగా సభలో ఆందోళన చెందాల్సిన అవసరం వచ్చిందంటే అది నిజమే అని గ్రామంలో జరిగిన సంఘటనపై ప్రజలు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో సతమతమవుతున్నారు.
సర్పంచ్ ఎన్నికల లెక్కింపు తెల్లవారి గ్రామంలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థిపై గెలిచిన సర్పంచ్ మరియు అతని సోదరుడు ఉద్దేశపూర్వకంగానే డాక్టర్ తోని దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందేనని వారు తెలిపారు ఈ సంఘటనలు పలువురు మహిళలతో పాటు ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి మరియు చిన్న పిల్లవాడికి తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటిన హైదరాబాద్ తరలించి చికిత్స అందించారు సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ బి ఆర్ ఎస్ అధిష్టానానికి సమాచారం అందించిన వెంటనే బారాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తక్షణమే స్పందించి ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు.
అనంతరం వారి చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారని ఈ సందర్భంగా వారు గుర్తించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాపై కక్ష కట్టి ట్రాక్టర్ తో దాడి చేశారని వారు ఆరోపించారు కానీ అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు గ్రామంలో పాత కక్షల వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని తెలపడం హాస్యాస్పదంగా ఉందని వారన్నారు నిజ నిర్ధారణ చేయడానికి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు మా గ్రామానికి వచ్చి మాలో ఎలాంటి పాత కక్షలు ఉన్నాయో నిరూపించాలని వారు డిమాండ్ చేశారు బాధితులకు చేయూత అందించడం పోయి మాపై లేనిపోని నిందలు మోపడం తగదని వారు అన్నారు.
ఇప్పటికైనా నిజ నిర్ధారణ చేసి దోషులను కఠినంగా శిక్షించే విధంగా కృషిచేసి నిజాయితీని నిరూపించుకోవాలని వారన్నారు. ఈ సంఘటన పార్టీలకు సంబంధం లేదని చెప్పిన ఎమ్మెల్యే మరి ఏం తెలుసుకొని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్ష పదవి నుండి సాయిబాబా తొలగించినట్లు మీ లెటర్ ప్యాడ్ పై సంతకం చేసి మరి పత్రికకు విడుదల చేశారు. రాజకీయాలకు సంబంధం లేకుంటే ఈ చర్య ఎందుకు తీసుకున్నారని ఎమ్మెల్యేలు సూటిగా ప్రశ్నించారు. సమావేశంలో గ్రామస్తులు బాలరాజ్ పంజా గౌడ్ నారాయణ సుదర్శన్ లక్ష్మీనారాయణ కిషోర్ జనార్దన్ రెడ్డి వెంకట్రాంరెడ్డి రవి తో పాటు పలువురు పాల్గొన్నారు.




