calender_icon.png 13 February, 2026 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ స్కూల్లో సరోజినీ దేవి జన్మదిన వేడుకలు

13-02-2026 05:47:31 PM

సదాశివానగర్, ఫిబ్రవరి 13(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో శుక్రవారం నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ దేవి  జన్మదిన పురస్కరించుకొని పాఠశాలలో ఇంగ్లీష్ డే ఘనంగా నిర్వహించినట్టు ప్రిన్సిపల్ రాజిరెడ్డి తెలిపారు. విద్యార్థులు చాలా చురుకుగా పాల్గొని వర్కింగ్ మోడల్స్ ను తయారు చేయడం జరిగింది. వారు తయారు చేసిన మోడల్స్ ను పాఠశాల లో ప్రదర్శించడం జరిగింది. మిగతా విద్యార్థులందరూ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. గ్రామర్ కు సంబంధించిన అంశాలను నేర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక స్కిట్ వేసి,దీనిద్వారా విలువల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించారు.ముఖ్యంగాTED -ED  student talk లో భాగంగా మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత గురించి తెలియజేశారు.